: ఐడియా నుంచి మరో ఆండ్రాయిడ్ 3జి ఫోన్


మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఐడియా విజ్ పేరుతో మరో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనును విడుదల చేసింది. దీని ధర 7,850 రూపాయలు. 4 అంగుళాల డబ్ల్యువిజిఎ డిస్ ప్లే, ఒక గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ స్టోరేజీ, వెనుక భాగంలో 5 మెగాపిక్సల్స్ కెమెరా, ముందు భాగంలో విజిఎ కెమెరా సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫోన్లో ఇంటర్నెట్ వేగంగా ఉంటుందని, మరెన్నో స్మార్ట్ అప్లికేషన్లు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, కేరళ తదితర సర్కిళ్లలో ఈ ఫోన్ కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు 259/261 రూపాయల రీచార్జ్ తో మూడు నెలలపాటు 1.6 జిబి ఉచిత డేటా అందిస్తామని తెలిపింది. అదే సమయంలో 2జి డేటా కూడా ఉచితమేనని పేర్కొంది. ఐడియా టివి ద్వారా టీవీ చానళ్లను మూడు నెలల పాటు ఉచితంగా చూడవచ్చని వెల్లడించింది.

  • Loading...

More Telugu News