: ప్రజలకు స్వల్ప ఊరట.. నేటి నుంచి పెట్రోలు బంకుల్లోనూ నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు
నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,500 పెట్రోలు బంకుల్లో నగదు విత్ డ్రాకు అనుమతినిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. డెబిట్, క్రెడిట్ కార్డును స్వైప్ చేసి రూ.2 వేలు తీసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఎస్‌బీఐకి చెందిన పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లను ఇప్పటికే ఆయా పెట్రోలు బంకుల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ప్రస్తుతానికి పీఓఎస్‌ల నుంచి రూ.2వేలు పొందవచ్చని, మరో మూడు రోజుల్లో మరో 20 వేల పెట్రోలు బంకుల్లో ఈ సౌకర్యం కల్పిస్తామని కేంద్రం పేర్కొంది.