: నోట్ల రద్దుకు 52 శాతం మంది ప్రజలు ఓకే.. చంద్రబాబు సర్వేలో బయటపడిన వైనం
పెద్ద నోట్ల రద్దును 52 శాతం మంది ప్రజలు స్వాగతిస్తుండగా 48 శాతం మంది రద్దుతో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే నోట్ల రద్దుపై ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకునేందుకు ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను సేకరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమస్య ఎలా ఉందనే విషయాన్ని కూడా సర్వేలో తెలుసుకున్నారు. సర్వేలో వెలుగు చూసిన సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.