: మీకొక రూల్, మాకొక రూల్ అంటే ఎలా రాజా?: పోసాని
పెద్ద నోట్ల మార్పిడి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించిన సినీ రచయిత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, రాజకీయనాయకులపై మండిపడ్డాడు. 'మీరు బహిరంగ సభలు పెట్టాలంటే కార్యకర్తలను తరలించడానికి, రోడ్లు, కూడళ్లు నిండిపోయేలా హోర్డింగులు పెట్టడానికి, ఎన్నికల్లో పంచడానికి కోట్లు కావాలి. అంటే రాజకీయ నాయకులు డబ్బులు వినియోగించుకోవాలి...దేశ ప్రజలు మాత్రం చెక్కులివ్వాలి, ఆధారాలు చూపే పత్రాలివ్వాలి, కొంత మొత్తమే అకౌంట్లో ఉంచుకోవాలి, ప్యూర్ గా ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి, ట్రాన్స్ పరెంట్ గా చూపించాలి. ఇదెక్కడి న్యాయం? మీకొక రూల్, మాకొక రూల్ అంటే ఎలా రాజా? మీరు, మీ పార్టీలు కూడా ఇకపై ప్రతిపైసాకి లెక్కలు చూపిస్తారా రాజా?' అంటూ నిలదీశాడు.