: లోకేశ్ అంటే ఒక ఫుల్ ప్యాకేజీ!: విద్యార్థులతో ముఖాముఖిలో నారా లోకేశ్


లోకేశ్ అంటే ఒక ఫుల్ ప్యాకేజీ అని టీడీపీ యువ నేత లోకేశ్ తనకు తాను చెప్పుకున్నారు. ఏపీలోని తిరుపతిలో చదలవాడ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్ ను 'మీకు ఎవరు ఆదర్శం?' అంటూ విద్యార్థులు ప్రశ్నించారు. దీనికి లోకేశ్ సమాధానమిస్తూ, కొన్ని విషయాల్లో తనకు తాతగారు ఆదర్శమని అన్నారు. మరికొన్ని విషయాల్లో తనకు తండ్రి స్పూర్తి అని చెప్పారు. ఇంకొన్ని విషయాల్లో తన మావయ్య స్పూర్తి అని తెలిపారు. మిగిలిన విషయాల్లో తన తల్లి స్పూర్తి అన్నారు. కొన్ని విషయాల్లో బ్రహ్మీ (భార్య బ్రాహ్మిణి) కూడా స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇన్ని అంశాల ఫుల్ ప్యాకేజీ లోకేశ్ అని ఆయన చెప్పారు. దీంతో విద్యార్థులు చప్పట్లతో కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News