: పెద్దనోట్ల రద్దుపై ‘నో ఒపీనియన్’ అన్న బిల్ గేట్స్
పెద్దనోట్ల రద్దుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మద్దతు ఇచ్చారంటూ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ ను ‘పెద్దనోట్ల రద్దుపై మీ అభిప్రాయం ఏమిటి?’ అని ఒక ఆంగ్లపత్రిక విలేకరి ప్రశ్నించగా.. ‘నో ఒపీినియన్’ అంటూ స్పందించారు. భారత్ చాలా స్పీడ్ గా డిజిటలైజ్ అవుతోందని, ఆధార్ కార్డు విధానం కూడా బాగుందని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంపై ఆయన్ని ప్రశ్నించగా..అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా వారితో కలిసి పనిచేస్తామని బిల్ గేట్స్ సమాధానమిచ్చారు.