: నల్ల కుబేరుల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు, మానసిక వ్యధ.. కొందరికి మూడు రోజులుగా నిద్రపట్టట్లేదు: సైకియాట్రిస్టులు


చుట్టూ నీరు ఉన్నా దాహం వేస్తే తాగలేని స్థితిని సముద్రంలో ఉండే మత్స్యకారులు అనుభ‌విస్తుంటారు. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో త‌మ వ‌ద్ద కోట్లాది రూపాయ‌లు ఉన్నప్ప‌టికీ వాటిని ఉప‌యోగించుకోలేని స్థితి న‌ల్లకుబేరుల‌కి వ‌చ్చింది. తాము ఇన్నాళ్లు అక్ర‌మంగా పోగు చేసుకున్న‌ కోట్లాది రూపాయల డబ్బు వృథా అయిపోతోంద‌ని న‌ల్ల కుబేరులు తీవ్ర ఆందోళ‌న‌లో ప‌డ్డారు. ఎన్నో ఏళ్లుగా ఎవ‌రికీ క‌నిపించ‌నివ్వ‌కుండా దాచుకున్న కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు ఏమైపోతుందోన‌ని వారి గుండెల్లో దడ పుడుతోంది. తీవ్ర మాన‌సిక బాధ‌తో రాత్రుళ్లు నిద్రపట్టడం లేదు, ఒళ్లంతా చెమటలు ప‌డుతున్నాయి. ముంబయికి చెందిన 55 ఏళ్ల ఓ వ్యాపారవేత్త ఇదే అనుభ‌వాన్ని ఎందుర్కుంటున్నాడు. ఇప్ప‌టికి రెండుసార్లు కార్డియాలజిస్ట్ (హృద్రోగ నిపుణుడు)ను, త‌రువాత‌ కేమ్ (కేఈఎం) ఆసుప‌త్రిలో సైకియాట్రిస్ట్ ను క‌లిశారు. ఒక్క‌సారిగా తాము దాచుకున్న డ‌బ్బు వృథాగా పోతుండ‌డంతో వారిలో తీవ్ర భ‌యాందోళ‌న‌లు, మాన‌సిక వేద‌న క‌లుగుతోంద‌ని సైకియాట్రిస్టులు, హృద్రోగ నిపుణులు పేర్కొన్నారు. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన న‌ల్ల కుబేరుడ‌యిన పేషెంటు విపరీతమైన మానసిక భయాందోళనకు లోనయ్యాడని డాక్ట‌ర్లు చెప్పారు. అత‌డికి గ‌త‌ మూడురోజులుగా నిద్ర పట్టడంలేద‌ని కేమ్ ఆసుప‌త్రి డాక్టర్లు చెప్పారు. దీంతో యాంటి డిప్రెషన్ మందులు ఇస్తున్నామ‌ని, ఇటువంటి వారు త‌మ వ‌ద్దకు చాలామందే వ‌స్తున్నార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News