: రోజా బర్త్ డే వేడుకలు..కేక్ తినిపించిన జగన్!


చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా బర్త్ డే ఈరోజు. అయితే, రోజా తన పుట్టినరోజు వేడుకలను తన ఇద్దరు పిల్లలు, స్నేహితులతో కలిసి నిన్న రాత్రి జరుపుకున్నారు. నగరిలోని సీవీఆర్ కల్యాణ మండపం, పుత్తూరులోని వికలాంగుల పాఠశాల, తిరుపతి ఎయిర్ పోర్ట్ వద్ద రోజా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఇదిలా ఉంచితే, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రోజాకు ‘హ్యాపీ బర్త్ డే’ చెప్పి కేక్ తినిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా రోజా తన అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలలో రోజాకు కేక్ తినిపిస్తున్న ఫొటో కూడా ఉంది.

  • Loading...

More Telugu News