: సైనికుల కోసం 50 లక్షల విరాళం ఇచ్చిన ప్రైవేట్ స్కూలు
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'సందేశ్ టు సోల్జర్'కు బెంగళూరులోని న్యూ హొరైజన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ చాలా గొప్పగా స్పందించింది. సైనికుల సంక్షేమం కోసం రూ. 50 లక్షలను విరాళంగా ఇచ్చింది. స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఉమ్మడిగా ఈ విరాళాన్ని ఇచ్చారు. కర్ణాటక, కేరళ ప్రాంత జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండింగ్ మేజర్ జనరల్ కేఎస్ నిజ్జర్ కు ఈ మొత్తాన్ని అందజేశామని స్కూల్ ఛైర్మన్ మోహన్ తెలిపారు. సైనికులకు స్ఫూర్తిదాయకమైన సందేశాలను పంపాలంటూ దీపావళి సందర్భంగా 'సందేశ్ టు సోల్జర్' మిషన్ ను ప్రధాని చేపట్టారు.