: ప్రజలకు ఉచిత సేవలందిస్తున్న మోదీ అభిమానిపై ప్రశంసలు


పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశ వ్యాప్తంగా ప్రజల అవస్థలు తెలియనివికావు. ముఖ్యంగా, కర్ణాటక రాష్ట్రంలో పాతనోట్లు మార్చుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రధాని నరేంద్ర మోదీ అభిమాని అయిన ఒక ఆటో డ్రైవర్ ను కలచివేశాయి. దీంతో, ప్రజలకు తన వంతు సాయం చేయడానికి ఆటో డ్రైవర్ సాధిక్ ముందుకొచ్చాడు. మంగళూరుకు చెందిన సాధిక్, పాతనోట్లు మార్చుకునేందుకు బ్యాంకులకు వెళ్లే వారికి ఉచితంగా ఆటో సేవలందిస్తున్నాడు. ఇతను అందిస్తున్న సేవలకు స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా సాధిక్ మాట్లాడుతూ, దేశంలో అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీ రాకెట్ల గుట్టురట్టు చేయడానికి ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నాడు. అయితే, పాతనోట్లు మార్చుకోవాలంటే ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని.. తాత్కాలిక ఇబ్బందులు పడుతున్నారని అన్నాడు. అందుకనే, తన వంతు సాయంగా బ్యాంకులకు వెళ్లే వారికి ఉచితంగా ఆటో సేవలందిస్తున్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News