: బుల్లి తెరపై మెరవనున్న అందాల రంభ
మొన్నటి వరకు వెండి తెర మీద సందడి చేసిన రంభ... ఇప్పుడు బుల్లి తెరపై సందడి చేసేందుకు వస్తోంది. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న 'ఏబీసీడీ (ఎనీబడీ కెన్ డ్యాన్స్)' ప్రోగ్రామ్ లో న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోంది ఈ అందాల తార. ఈ విషయాన్ని జీ తెలుగు ప్రతినిధి వెల్లడించారు. హీరోయిన్ గా ఉన్న రోజుల్లో రంభ అందానికి, డ్యాన్సులకు కుర్రకారు వెర్రెత్తి పోయేవారు. డ్యాన్స్ లో రంభ స్టైలే వేరు. అలాంటి రంభ... ఇప్పుడు డ్యాన్స్ ప్రోగామ్ కు జడ్జిగా రానుండటం బుల్లి తెర ప్రేక్షకులకు గుడ్ న్యూసే!