: పాకిస్థాన్ పేరు చెప్పుకుని బతికేది మీరు...పాకిస్థాన్ తో బాధలు పడేది మేము!: గులాం నబీ ఆజాద్ ఘాటు స్పందన


24 గంటలు పాకిస్థాన్ పేరు చెప్పుకుని బతికే పార్టీ బీజేపీ అని గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేశారు. రాజ్యసభలో విపక్షాలు పాకిస్థాన్ కు మద్దతు తెలుపుతున్నాయంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా దీటుగా స్పందించారు. సమస్య వచ్చిన ప్రతిసారీ బీజేపీకి పాకిస్థాన్ గుర్తుకు వస్తుందని, 24 గంటలూ పాకిస్థాన్ పేరు చెప్పి బతుకుతున్న పార్టీ బీజేపీ అని, తాము 24 గంటలు పాకిస్థాన్ తో పోరాడుతున్నామని ఆయన చెప్పారు. పార్లమెంటులో కూర్చుని బీజేపీ నేతలు పాకిస్థాన్ గురించి గొప్పగొప్ప ప్రసంగాలు ఇస్తారని, తాము 24 గంటలూ పాకిస్థాన్ కురిపించే తుపాకి గుళ్లను భరిస్తున్నామని అన్నారు. పాకిస్థాన్ తో సైనికులు ఎంత పోరాడుతున్నారో... కశ్మీర్ లో ఉంటూ తాము కూడా అంతే పోరాడుతున్నామని ఆయన చెప్పారు. తమ ప్రజలు ప్రతి రోజూ తూటాల దెబ్బలు తింటున్నారని అన్నారు. బీజేపీ నేతలు దేశ భక్తి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News