: నోట్లు మార్పిడి చేస్తానంటూ 50 లక్షలు ఎత్తుకెళ్లిన వారు దొరికారు!


రద్దయిన పాత నోట్లను మార్పిడి చేస్తామని నమ్మించి, రూ. 50 లక్షలను ఎత్తుకొనిపోయిన కేసును హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. డబ్బుతో ఉడాయించిన వారిని అదుపులోకి తీసుకుని రూ. 50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. డబ్బులు ఎత్తుకుపోయిన ఘటన నిన్న చోటు చేసుకుంది. జరిగిన ఘటనతో కంగుతిన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News