: తలకు బంతి తగలడంతో విలవిల్లాడిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ వోజస్


ఈ ఏడాది మే నెలలో జ‌రిగిన‌ ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడుతూ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ వోజస్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఆయ‌న మ‌రోసారి అదే విధంగా గాయ‌ప‌డ్డాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో భాగంగా తస్మానియా జట్టుతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఆయ‌న ఈ రోజు ఆట‌లో పాల్గొన్నాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ కామ్ స్టీవెన్సన్ విసిరిన బంతిని ఎదుర్కొనే క్ర‌మంలో వోజస్ తలకు బంతి బలంగా తాకింది. దీంతో ఆయ‌న విలవిల్లాడిపోయాడు. వెంట‌నే మైదానంలోకి వ‌చ్చిన వైద్య సిబ్బంది ఆయ‌న‌ను అక్క‌డి నుంచి తరలించారు. గాయం పాల‌యిన వోజ‌స్‌ దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుకు దూర‌మ‌వుతాడ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ్గానే ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News