: ఫిట్ నెస్ మెళకువలు నేర్పనున్న రకుల్ ప్రీత్... 20న భారీ కార్యక్రమం


తమను తాము రక్షించుకునే క్రమంలో ఆడపిల్లలకు వారి ఫిట్నెస్ అత్యంత కీలకమైనది. ఇదే అంశంపై జనాల్లో అవగాహన కల్పించేందుకు 'ఫిట్నెస్ అన్ ప్లగ్డ్' అనే కార్యక్రమాన్ని ది గ్రేట్ ఫ్యాన్ డాట్ కామ్ (THEGREATFAN.COM) సంస్థ నిర్వహిస్తోంది. ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ మెళకువలను నేర్పించనుంది. ఐదు గంటల పాటు ఈ మొత్తం కార్యక్రమం జరుగుతుంది జరగనుంది. యుక్త వయసు నుంచే అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్, బాడీ అండ్ మైండ్ ఫిట్ నెస్ లపై అవగాహన పెంచుకోవాలని, దానికి తగిన ప్రాక్టీస్ చేయాలని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహర్ష ఫౌండేషన్ నిర్వాహకులు హిమబిందురెడ్డి మాట్లాడుతూ, కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిపారు. మరోవైపు, ఈ కార్యక్రమం నేపథ్యంలో రకుల్ ప్రీత్ కొంతమంది అత్యాచార బాధితురాళ్లను కలిసింది. వారిపై జరిగిన శారీరక, మానసిక దాడులు ఆమెను కలచివేశాయి. అందుకే ఈ అవేర్ నెస్ కార్యక్రమంలో రకుల్ భాగస్వామి అయినట్టు నిర్వాహకులు తెలిపారు. 'రకుల్ ఎఫ్ 45' పేరుతో ఈ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించబోతున్నారు. మరోవైపు, ఈ కార్యక్రమం నుంచి వచ్చే ఫండ్ ను అత్యాచార బాధితురాళ్ల చదువు కోసం వినియోగిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News