: మెట్టుదిగిన ములాయం, శివపాల్... తిరిగొచ్చిన రాంగోపాల్ యాదవ్
తన సోదరుడు రాంగోపాల్ యాదవ్ ను ఆరేళ్లపాటు సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన శివపాల్ యాదవ్, తిరిగి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి అఖిలేష్ వర్గంలోని రాంగోపాల్ ను ములాయం సూచన మేరకు శివపాల్ స్వయంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆయన పార్టీలో గతంలో నిర్వహించిన సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులోనే ఉంటారని, పార్టీ కార్యదర్శిగా కూడా విధులు నిర్వహిస్తారని ములాయం ఓ ప్రకటనలో తెలిపారు. ఆపై రాంగోపాల్ మాట్లాడుతూ, నేతాజీ తనకెప్పుడూ వ్యతిరేకం కాదని, ఆయన చెప్పిన మాటను తానెన్నడూ జవదాటలేదని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎన్నడూ పనిచేయలేదన్నారు.