: ఉభయసభల్లో గందరగోళం.. లోక్‌సభ రేపటికి వాయిదా.. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనాలోచితంగా తీసుకుందని విపక్ష సభ్యులు ఈ రోజు పార్లమెంటు ఉభయసభల్లో నినాదాలు చేశారు. దీంతో ఇరు సభల్లో గందరగోళం కొనసాగింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో చైర్మన్ పోడియం చుట్టూ చేరిన ప్రతిపక్ష పార్టీల నేతలు నినాదాలు చేయడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను ఈ రోజు మధ్యాహ్నం 2 వరకు గంటలకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, లోక్ సభలో పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష నేతలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.