: ఇంకా లభించని కిడ్నీ డోనర్, ఆసుపత్రిలోనే సుష్మా స్వరాజ్
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఇంకా మూత్రపిండాల దాత లభించలేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. 64 సంవత్సరాల ఆమెకు రెండు కిడ్నీలూ పాడైపోవడంతో డయాలసిస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 7న ఆమె ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతుండగా, అప్పటి నుంచి ఆమె బ్లడ్ గ్రూప్ కు సరిపడే కిడ్నీలున్న డోనర్ లభించలేదని డాక్టర్లు వెల్లడించారు. ఆమెకు మూత్ర పిండాలను ఇచ్చేందుకు పలువురు దాతలు సిద్ధమని ప్రకటించినప్పటికీ, ఇంతవరకూ ఎవరి కిడ్నీ కూడా మ్యాచ్ కాలేదని తెలుస్తోంది. ఆమెకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ మరింత ఆలస్యం కావచ్చని ఎయిమ్స్ వైద్యులు అభిప్రాయపడ్డారు. ఇక ఆమె త్వరగా కోలుకోవాలంటూ రాజకీయ నేతలు ముక్తార్ అబ్బాస్ నక్వీ, జయంత్ సిన్హా, అరవింద్ కేజ్రీవాల్, వసుంధరా రాజే, అంబికా సోని, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తదితరులు ఆకాంక్షించారు.