: భక్తులిచ్చిన తలనీలాలనూ వదల్లేదు... శ్రీశైలంలో లక్షల విలువైన వెంట్రుకల చోరీ
చోరాగ్రేసరులు తల నీలాలనూ వదల్లేదు. శ్రీశైలంలోని కల్యాణకట్టలో భక్తులు మల్లికార్జునుడు, భ్రమరాంబాదేవిలకు భక్తితో సమర్పించిన కురులను దొంగలెత్తుకు పోయారు. లక్షలాది రూపాయల విలువైన కురులు మాయమైనట్టు గమనించిన అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది చేతివాటం లేకుండా ఈ దొంగతనం జరిగుండదన్న ఆలోచనతో కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కల్యాణకట్ట, కురులు భద్రపరిచే ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించాల్సి వుందని వివరించారు.