: పది రోజుల్లో 20 శాతం పడిపోయిన నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్
నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తరువాత అత్యధికంగా నష్టపోయిన సెక్టార్లలో నిర్మాణ రంగం ముందు నిలిచింది. మోదీ గడచిన 8వ తేదీ మంగళవారం నాడు డీమానిటైజేషన్ గురించి ప్రకటించగా, ఆ తరువాతి సెషన్లలో నిఫ్టీ-50 ఇండెక్స్ 5 శాతం పతనమైంది. ఇదే సమయంలో రియాల్టీ ఇండెక్స్ ఏకంగా 20 శాతం దిగజారింది. నోట్ల రద్దు నిర్ణయం అత్యధిక ప్రభావం చూపింది రియల్ ఎస్టేట్ పైనేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా కొత్త కొనుగోళ్ల డిమాండ్ పడిపోయిందని, ఢిల్లీ, ముంబై మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయని, బెంగళూరు, హైదరాబాద్ లలో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయని నిపుణులు వెల్లడించారు. ఇక ఈ నెల 9వ తేదీ నాటి లిస్టింగ్ ప్రైస్ తో పోలిస్తే డెల్టా కార్ప్ అత్యధికంగా 56.1 శాతం నష్టపోయింది. ఆపై అన్సాల్ హౌసింగ్ (54 శాతం), సన్ టెక్ రియాల్టీ (49.3 శాతం), ఎల్డెకో హౌసింగ్ (45 శాతం) విపుల్ లిమిటెడ్ (41 శాతం), సీఅండ్ సీ కన్ స్ట్రక్షన్స్ (40 శాతం), డీఎల్ఎఫ్ (32.3 శాతం), గ్లోబస్ పవర్ (28 శాతం), హెచ్డీఐఎల్ (28 శాతం) నష్టపోయాయి. (ఈ నష్ట శాతం నవంబర్ 16 వరకూ)