: ముంబైలోని ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ... ప్రజలకీ అవస్థలేంటని ప్రశ్న


నాలుగు రోజుల క్రితం న్యూఢిల్లీలోని బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలబడి పాత కరెన్సీని మార్చుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఈ రోజు ముంబైలోని ఏటీఎం సెంటర్ క్యూలో నిలుచున్నారు. ముంబై సబర్బన్ పరిధిలోని వకోలా ప్రాంతంలోని ఓ ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్లిన ఆయన ప్రజలతో పాటు క్యూలో నిలుచుని డబ్బు విత్ డ్రా చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే క్యూలో ఉన్న వారిని నోట్ల రద్దుపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పరువు నష్టం దావా కేసులో భీవండీ కోర్టు నుంచి బెయిల్ పొందిన ఆయన తిరిగి ముంబై వస్తూ ఈ ఏటీఎం దగ్గర ఆగారు. నోట్ల రద్దు ప్రకటించి 10 రోజులు గడుస్తున్నా, ఏటీఎంలు ప్రజల అవసరాలను తీర్చలేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సామాన్యులు ఇటువంటి అవస్థలను ఎందుకు అనుభవించాలని ప్రశ్నించిన ఆయన, ముందస్తు ఏర్పాట్లు లేకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News