: గన్ తో సర్పంచ్ ని బెదిరించిన టీఆర్ఎస్ నేత.. చితకబాదిన సర్పంచ్ అనుచరులు!
తుపాకీతో ఓ టీఆర్ఎస్ నేత హంగామా సృష్టించాడు. వీరంగం వేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత నారాయణరెడ్డికి, ఆ గ్రామ సర్పంచ్ కు ఈ రోజు ఉదయం గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద ఘర్షణ జరిగింది. దీంతో, తన వద్ద ఉన్న తుపాకితో సర్పంచ్ ను నారాయణరెడ్డి బెదిరించాడు. జరిగిన ఘటనతో అక్కడ అలజడి రేగింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ వర్గీయులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని, నారాయణరెడ్డిని చితకబాదారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు ఆయన వద్ద ఉన్న గన్ ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.