: ఈ విషయంలో మాత్రం చైనాను భారత్ మించిపోయింది!


చైనాతో పోటీపడాలనుకుంటున్న భారత్ ఓ విషయంలో ఆ దేశాన్ని అధిగమించింది. అయితే, ఇదేదో మనం సంతోషపడే విషయంలో కాదండోయ్... సిగ్గుతో తల దించుకునే విషయంలో! వాయు కాలుష్యం ద్వారా అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో చైనాను భారత్ అధిగమించింది. గాలిలో విషవాయువులు కలుస్తున్న కారణంగా గత ఏడాది భారత్ లో ప్రతిరోజూ 3,283 మంది మృత్యువాత పడ్డారు. చైనాలో ఇది 3,233గా మాత్రమే ఉందట. గ్రీన్ పీస్ సంస్థ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నిన్న సాయంత్రం గ్రీన్ పీస్ తన నివేదికను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాతావరణ కాలుష్యంపై దృష్టి సారించడం లేదని అధ్యయనం వెల్లడించింది. పరిశ్రమలు వదులుతున్న కాలుష్యం, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం, చలికాలం ప్రభావం వంటివి దీనికి కారణమని తెలిపింది. భారత్ లోని అన్ని నగరాల కంటే ఢిల్లీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా చాలా కృషి చేస్తోందని, కఠినమైన నిబంధనలను విధించిందని కితాబిచ్చింది.

  • Loading...

More Telugu News