: విశాఖ క్రికెట్ స్టేడియంలో చంద్రబాబు నాయుడు
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం తొలిసారి ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తోంది. దీంతో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రత్యేకంగా ఆహ్వానించింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా కలసి మ్యాచ్ తొలి రోజున స్టేడియంకు రావాల్సిందిగా కోరారు. దీంతో, ఎంతో బిజీగా ఉండి కూడా చంద్రబాబు విశాఖ క్రికెట్ స్టేడియంకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది.