: మారిన గేమ్ ప్లాన్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పూర్తిగా ఎండిపోయినట్టున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసి, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్ లో ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసిన టీమిండియా కేఎల్ రాహుల్ ను తుది జట్టులోకి తీసుకుంది. మిశ్రా స్థానంలో జయంత్ యాదవ్ కు స్థానం లభించింది. దీంతో తన కెరీర్ లో తొలి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం యాదవ్ కు లభించినట్లయింది. మరికొద్ది సేపట్లో భారత తొలి ఇన్నింగ్స్ ప్రారంభంకానుంది.