: మరో అరుదైన మైలురాయి ముందు నవ్యాంధ్ర... కాసేపట్లో సీఎం చేతుల మీదుగా తొలి టెస్టు
రెండున్నరేళ్ల క్రితం ఏర్పడిన నవ్యాంధ్ర మరో మైలురాయిని నేడు దాటనుంది. రాష్ట్ర చరిత్రలో తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్ నేడు విశాఖలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా రానున్నారు. కాగా, చిల్లర కొరత కారణంగా లోఎండ్ టికెట్లు అమ్ముడు కాకపోవడంతో, తొలి రోజున పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించిన విషయం విదితమే. ఇప్పటికే స్టేడియం దాదాపు నిండిపోగా, మరికాసేపట్లో సీఎం రానున్నారు.