: ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 4.2గా నమోదైనట్టు తెలిపారు. హరియాణాలోని బావల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం కలగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.