: ట్రంప్‌ను చంపేస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టింగ్.. సీఈవోను ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ
ట్రంప్ ఎన్నికైన వేళావిశేషం ఏంటో కానీ అమెరికన్ల మద్దతు కంటే నిరసనలే ఆయనకు ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించేది లేదంటూ చాలా రాష్ట్రాల ప్రజలు రోడ్లపైకి ఎక్కి నిరసన గళం వినిపిస్తున్నారు. తాజాగా అమెరికాలోని ప్యాకెట్‌స్లెడ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో మాథ్యూ హారిగన్‌కు కూడా ట్రంప్ అంటే నచ్చలేదు. అందుకే ఆయనను చంపేస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. అదికాస్తా వైరల్‌గా మారడంతో కంపెనీ యాజమాన్యానికి వణుకు మొదలైంది. అది తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడిన సదరు సంస్థ మాథ్యూ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉన్నారని, ఆయన పోస్టుతో సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది. సంస్థ ప్రకటనతో తప్పు తెలుసుకున్న మాథ్యూ.. తాను సరదాగా జోక్ చేశానని, తన గురించి తెలిసిన వారెవరూ తానలాంటి పనిచేస్తానని అనుకోరని పేర్కొన్నాడు. తప్పుగా అనిపిస్తే క్షమించాలంటూ ఫేస్‌బుక్‌లో మరో పోస్టు చేశాడు. ఆయన పోస్టును సీరియస్‌గా తీసుకున్న సంస్థ అతడి పోస్టును సంస్థ వెబ్‌సైట్ నుంచి తొలగించడడమే కాకుండా అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.