: ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్‌.. ప్ర‌క‌టించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు వ‌చ్చిన‌ట్టు ప్ర‌భుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. మొత్తం ఏడు రోజుల్లో 240.90 ల‌క్ష‌ల న‌గ‌దు డిపాజిట్ల లావాదేవీలు జ‌రిగినట్టు పేర్కొంది. న‌వంబ‌రు 8వ తేదీన అర్ధ‌రాత్రి నుంచి పెద్ద నోట్లు చెల్లుబాటు కావ‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌రు ప‌దో తేదీ నుంచి రూ.1000, రూ.500 నోట్ల పాత నోట్ల మార్పిడి విలువ రూ.5,776 కోట్లు, విత్ డ్రాలు రూ.18,665 కోట్లు జ‌రిగిన‌ట్టు సంస్థ పేర్కొంది. ఇందుకోసం 151.93 ల‌క్ష‌ల లావాదేవీలు జ‌ర‌గ్గా రోజుకు రూ.4,500 కోట్ల‌కు స‌మాన‌మైన రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. విత్‌డ్రాల ప‌రిమితి రోజుకు రూ.2,500, వారానికి రూ.24వేలకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా డిపాజిట్ల జోరు మ‌రో మూడు నాలుగు రోజులు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని అంత‌ర్జాతీయ రేటింగ్ దిగ్గ‌జం మూడీస్ అంచ‌నా వేసింది.

  • Loading...

More Telugu News