: మోదీ నిర్ణయం సరైనదే.. ఫలితాలు చూశాక అదెంత మంచి నిర్ణయమో ప్రజలే గ్రహిస్తారు!: మారిషస్ ప్రధాని
పెద్ద నోట్ల రద్దు విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని మారిషస్ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ ప్రశంసించారు. నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. తాత్కాలికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఫలితాలు చూశాక అదెంత మంచి నిర్ణయమో ప్రజలే గ్రహిస్తారన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో తమకు మంచి సంబంధాలున్నాయన్న అనిరుధ్, భారత్‌తో తమది రక్తసంబంధమన్నారు. ఎంతోకాలంగా ఆ దేశం తమకు సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. భారత్ సాయానికి తాము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటామని అనిరుథ్ పేర్కొన్నారు.