: పెద్ద నోట్ల రద్దు.. ఆర్థిక స్వేచ్ఛలో తొలి అడుగు.. నెలరోజులు భరించండి: రాజ్‌నాథ్‌సింగ్ పిలుపు
పెద్ద నోట్ల రద్దు ఆర్థిక స్వేచ్ఛలో తొలి అడుగని, నోట్ల రద్దు కారణంగా ఉత్పన్నమవుతున్న కష్టాలు మరో నెలరోజులు భరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రజలను కోరారు. ఇది సామాన్యమైన నిర్ణయం కాదని, దీనివల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. హరియాణాలోని రేవాలో జరిగిన అమరవీరుల ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించే పెద్దనోట్లను రద్దు చేసినట్టు తెలిపారు. మరో నెల రోజులు కొన్ని ఇబ్బందులు తప్పవని, ప్రజలు ఓపికగా భరించాలని కోరారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ ఇంకా రాలేదన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.