: అందుకే, ఆ పక్షి ‘ట్రంప్ బర్డ్’ అయింది!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్ పై మీడియాలో నాడు ప్రత్యేక చర్చలు జరిగాయి. ట్రంప్ ది అసలు జుట్టేనా? లేక ‘విగ్’ పెట్టుకున్నారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఎట్టకేలకు, ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ట్రంప్ విగ్ పెట్టుకోలేదని, అసలైన హెయిర్ స్టైలే అని తేలింది. ఇదంతా నాటి విషయం. తాజా విషయం ఏమిటంటే, చైనాలోని హంగ్ జోపు సఫారీ పార్కులో ఉన్న ఒక పక్షికి ట్రంప్ జుట్టును పోలిన జుట్టు ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో, ఈ పక్షి తెగ ఫేమస్ అయిపోయింది. ఇంకేముంది.. దానికి ‘ట్రంప్ బర్డ్’ అని పేరు పెట్టేశారు. ఈ ‘ట్రంప్ బర్డ్’ని చూసేందుకు సందర్శకులు క్యూ కడుతుండటం విశేషం. ఈ ‘ట్రంప్ బర్డ్’ ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ అయ్యాయి.

  • Loading...

More Telugu News