: పోలీసులు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో పోలీసుల చేతిలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం నుంచి ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.