: 15 లోపు కృష్ణా-గోదావరి బోర్డుల విధివిధానాలు ఖరారు
వచ్చే నెల 15వ తేదీలోపు కృష్ణా-గోదావరి యాజమాన్య బోర్డుల నిర్వహణ విధివిధానాలను ఖరారు చేయనున్నారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి గోదావరినదీ యాజమాన్య బోర్డు చైర్మన్ రాంశరణ్ అధ్యక్షత వహించారు. బోర్డు నిర్వహణ విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తో పాటు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు తదితరులు పాల్గొన్నారు.