: వచ్చే బుధవారం నుంచి కొత్త సచివాలయం నుంచే విధులు నిర్వహించనున్న చంద్రబాబు
వచ్చే బుధవారం నుంచి కొత్త సచివాలయం నుంచే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన విధులు నిర్వహించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని నగర నిర్మాణ పురోగతిపై చంద్రబాబు సమీక్షించారు. విజయవాడలో 5 వేల ఇళ్లు నిర్మించాలని, సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా వీటిని నిర్మించాలని, ఉద్యానవన సంరక్షణలో రాజధాని రైతులకు శిక్షణ ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. కొత్త రాజధానిలో వాటర్ ఫ్రంట్ పార్కులు ఏర్పాటు చేయాలని, ఉద్యానవనాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అమరావతిని బ్లూ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. నీటి సంరక్షణకు రాజధానిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వైట్ టాప్ రోడ్లు, గ్రీన్ బెల్ట్ ఏర్పాట్లకు ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు సూచించారు.