: లలిత్ మోదీని భారత్ కు రప్పించడానికి మార్గం సుగమం
యూకేలో తలదాచుకున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని తిరిగి భారత్‌కు రప్పించేందుకు ఈడీ చేస్తోన్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఆయనను భారత్ కు తీసుకురావాలని కోరుతూ ఈడీ చేస్తోన్న విన్నతిని కోర్టు అంగీకరించింది. ఈడీ సూచనల మేరకు యూకే గవర్నమెంటుకు లేఖ రాయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అయితే, ఆయన యూకేలోనే ఉండటంతో కేసు ముందుకు కదలడం లేదు. కొన్ని నెలల క్రితం వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకురావాలని ఈడీ ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలమైన విషయం తెలిసిందే. విజయమాల్యాను అక్కడి నుంచి పంపించడానికి ఆ దేశ గవర్నమెంటుకు చట్టం అడ్డొచ్చింది. మళ్లీ అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా ఈ సారి కోర్టు ద్వారా యూకే ప్రభుత్వానికి లేఖ పంపాలని ఈడీ ఈ అభ్యర్థన చేసింది.