: ముద్రగడ ఏమైనా టెర్రరిస్టా? అంబటిని రహస్య ప్రాంతానికి ఎందుకు తరలించారు?: వైసీపీ నేత కన్నబాబు


కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కాపు నేతలను ఎందుకు అరెస్టు చేశారని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ‘ముద్రగడ ఏమైనా టెర్రరిస్టా? ఆయనను ఎవరూ కలవకూడదా?’ అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును రహస్య ప్రదేశానికి తరలించాల్సిన అవసరమేమిటన్నారు. పోలీసులు అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులను తక్షణం విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News