: మానసిక ఒత్తిడి కారణంగా ఇద్దరు కుమారులను హతమార్చిన తండ్రి
న్యూ ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ తండ్రి ఈ రోజు స్కూలు విద్యార్థులయిన తన ఇద్దరు కొడుకులను హత్య చేశాడు. సంజయ్‌నగర్ వాసి అయిన 43 ఏళ్ల ముఖేష్ అనే వ్యక్తి భార్య 2015లో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. దానికి తోడు జాబ్ లేకుండా ఇంట్లోనే గడుపుతున్న ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటున్నాడు. ఇటీవలే ఆయన తన ఇంట్లో కొన్ని నిర్మాణ పనులు మొదలుపట్టాడు. అయితే, ఆ పనులపై ఇరుగుపొరుగువారు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలోనే తీవ్ర ఒత్తిడితో ఈ రోజు ఇంట్లో ఉన్న తన కుమారులయిన ఆయుష్(15), ఆర్యన్(13)లను ను గొంతునులిమి హత్య చేశాడు. తరువాత పోలీసుల ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.