: ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలకు నిధులు ఆలస్యంగా వస్తున్నాయేమో!: సిద్ధార్థనాథ్ సింగ్ సెటైర్


బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తోన్న ప్రత్యేక ప్యాకేజీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తిగా తెలుసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై జ‌న‌సేనాని విమ‌ర్శ‌లు చేయాల‌నుకుంటే ప్ర‌త్యేక ప్యాకేజీని పూర్తిగా అర్థం చేసుకున్నాకే వ్యాఖ్య‌లు చేయాల‌ని ఆయ‌న సూచించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలకు, సినీపరిశ్రమకు నిధులు ఆలస్యంగా వస్తూ ఉండవ‌చ్చ‌ని ఆయ‌న సెటైర్ వేశారు. ఏపీకి మాత్రం నిధులు వెళుతున్నాయని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News