: ట్రంప్ మాస్క్ లకు జపాన్ లో భలే గిరాకీ!
అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమానుల సంఖ్య జపాన్ లో కూడా పెరుగుతోంది. ఇందుకు నిదర్శనం జపాన్ లోని ఒక రబ్బరు సంస్థ తయారు చేస్తున్న ట్రంప్ మాస్క్ లే. జపాన్ లోని ప్రముఖ నటీనటులు, రాజకీయ ప్రముఖుల మాస్క్ లను ఈ సంస్థ తయారు చేస్తుంటుంది. గతంలో రోజుకు ట్రంప్ మాస్క్ లను 45 మాత్రమే తయారు చేసిన ఈ సంస్థకు ప్రస్తుతం గిరాకీ బాగా పెరిగింది. ట్రంప్ మాస్క్ లు కావాలంటూ వస్తున్న ఆర్డర్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో, రోజుకు 350 మాస్క్ లను తయారు చేస్తున్నట్లు ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు చెబుతున్నారు.