: పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయిన గాలి జనార్దనరెడ్డి కూతురు.. అత్యంత ఘ‌నంగా వివాహ‌ వేడుక‌


కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డి కూతురి పెళ్లి వేడుక ఈ రోజు అతిరథ మహారథుల సమక్షంలో, సినిమా సెట్ల‌ను త‌ల‌దన్నే భారీ సెట్టింగ్ ల మ‌ధ్య ఘ‌నంగా జ‌రిగింది. బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో జ‌రిగిన ఈ వేడుక‌లో ఆభ‌ర‌ణాల‌తో, పెళ్లిదుస్తుల్లో గాలి జ‌నార్ద‌నరెడ్డి కూతురు బ్రాహ్మణి మెరిసిపోయింది. ప్యాలెస్‌ మైదానంలో తిరుపతి, హంపి, బళ్లారి తరహాలో భారీ సెట్టింగ్‌లు వేసి జ‌రిపించిన ఈ పెళ్లి వేడుక‌కు మొత్తం 50 వేల మంది అతిథులు హాజ‌రైన‌ట్లు స‌మాచారం. ప్యాలెస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు అద‌ర‌హో అనేలా క‌నిపించాయి. రాజీవ్ రెడ్డి, బ్రాహ్మ‌ణిల వివాహాన్ని టీటీడీకి చెందిన పూజారులు దగ్గరుండి జరిపించారు. వివాహానికి వచ్చినవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహ‌కులు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని ఏర్పాట్లు చేశారు. దేశంలోని అనేక‌ రకాల వంటకాలు అతిథుల నోరూరించాయి. పెళ్లికి వ‌స్తోన్న‌ అతిథుల‌ను ప్రత్యేక వాహనాల్లో అక్క‌డికి తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News