: నరేంద్రమోదీ స్నేహితుల వద్ద చాలా నల్లధనం ఉంది: రాహుల్‌గాంధీ


నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహారాష్ట్రలోని భివండిలో ఈ రోజు ఆయ‌న మాట్లాడుతూ... మోదీ స్నేహితుల వ‌ద్ద కూడా న‌ల్ల‌ధ‌నం ఉంద‌ని ఆరోపిస్తూ, వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ఏడాది కాలంలో మోదీ ప్ర‌భుత్వం రూ. 1.10 లక్షల కోట్ల పారిశ్రామిక వేత్త‌ల బ్యాంకు బ‌కాయిల‌ను ర‌ద్దు చేయించిందని, ఆ బ‌కాయిలు మొత్తం 15 మందికి చెందిన వ్యాపార వేత్తలవేనని ఆయ‌న ఆరోపించారు. 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేసి, సామాన్యుడి నుంచి డబ్బులు తీసుకొని మోదీ వాటిని పారిశ్రామికవేత్తలకు అందిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. పారిశ్రామిక వేత్త‌ల‌యిన మెదీ స్నేహితుల వ‌ద్ద‌ నల్లధనం ఉంద‌ని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News