: రియలెస్టేట్, ఎక్సైజ్ లను ఆదాయ వనరులుగా చూడటం తప్పు: కోదండరామ్
గత పాలకులు అనుసరించిన విధానాలతోనే దేశంలో బ్లాక్ మనీ పెరిగి పోయిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. దేశ స్థూల ఆదాయంలో 30వ వంతు నల్లధనం ఉందని చెప్పారు. నల్లధనాన్ని నివారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాలు చూసుకోవడం తప్పుకాదని... అయితే, రియలెస్టేట్, ఎక్సైజ్ లను కూడా ఆదాయ మార్గాలుగా భావించడం తప్పని చెప్పారు.