: రజనీ.. ‘కబాలి’కి మీ పారితోషికంగా బ్లాక్ లో, వైట్ లో ఎంతెంత ముట్టిందో చెప్పగలరా?: తమిళ దర్శకుడు అమిర్


పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హర్షం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయడం తెలిసిందే. అయితే, ఈ ట్వీట్ పై తమిళ దర్శకుడు అమీర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమీర్, రజనీకాంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా స్పందించని రజనీ, పెద్దనోట్ల రద్దుపై స్పందిస్తూ మోదీని ప్రశంసించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ‘హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీ జీ.. నవభారతం ఆవిర్భవించింది.. జైహింద్’ అంటూ రజనీ ట్వీట్ చేశారని, అయితే, ‘కబాలి’ సినిమా విడుదలైంది పాతభారతంలోనేనని, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంత వసూలు చేసిందో ప్రభుత్వానికి సమర్పిస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ చిత్రానికి రజనీ పారితోషికం బ్లాక్ లో, వైట్ లో ఎంతెంత తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తోందన్నారు.

  • Loading...

More Telugu News