: బ్యాంకుకు వచ్చి నోట్లు మార్చుకున్న పవన్ కల్యాణ్


నోట్ల మార్పిడి కోసం సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం బ్యాంకులకు వస్తున్నారు. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి వారు కూడా బ్యాంకులకు క్యూ కడుతున్నారు. ఇదే క్రమంలో జనసేన అధినేత, ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని ఓ బ్యాంకుకు స్వయంగా వచ్చి, తన వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకున్నారు. అందుకు సంబంధించి పవన్ బ్యాంకులో కూర్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, బ్యాంకుకు పవన్ వచ్చారన్న విషయం చుట్టుపక్కల పొక్కడంతో, ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. కానీ, ఆయన మాత్రం తన పనిని పూర్తి చేసుకుని, అక్కడ నుంచి త్వరగా వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News