: ఇలా చేస్తే మీరు ఏమీ సాధించలేరు: నానా పటేకర్
బాలీవుడ్ విలక్షణ నటుడు నానాపటేకర్ జమ్ముకశ్మీర్ యువతను ఈ రోజు కలిశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, ముందు బాగా చదువుకోవాలని చెప్పారు. చదువుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుందని సూచించారు. ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలని... రాళ్లు రువ్వడం లాంటివి చేస్తే జీవితంలో పైకి రాలేరని చెప్పారు. ఈ దేశం మనది అని మీరు అనుకుంటే... ఆ తర్వాత అన్నీ సులువవుతాయని తెలిపారు. భారత సైనికులతో కలిసి నానా పటేకర్ యువతను కలిశారు. ఈ సందర్భంగా సైనికులపై నానా ప్రశంసలు కురిపించారు. అందరికీ అన్ని పండుగలు ఉన్నప్పటికీ, సైనికులకు మాత్రం లేవని... సెలవు లేకుండా పనిచేయడం వారికి మాత్రమే చెల్లిందని చెప్పారు. సైనికుల మనోధైర్యాన్ని పెంచడానికి తాను ఇక్కడకు రాలేదని... వాళ్ల నుంచే తాను ఎంతో స్ఫూర్తిని పొందానని తెలిపారు.