: అర్బన్ కో-ఆపరేటివ్, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు పాతనోట్లు స్వీకరించాలి: ఆర్ బీఐ ఆదేశాలు
అర్బన్ కో-ఆపరేటివ్, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు పాతనోట్లు స్వీకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) ఆదేశించింది. పాతనోట్లను ఈ బ్యాంకులు స్వీకరించడం లేదంటూ ఖాతాదారుల నుంచి పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, నాబార్డులు ఆర్బీఐ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఖాతాదారుల నుంచి పాతనోట్లు తీసుకునే విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.