: ఆజాద్‌పూర్‌మండీ వద్ద రద్దయిన నోట్లపై రేపు కేజ్రీవాల్ సమావేశం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై మండిపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రద్దయిన పెద్దనోట్ల కారణంగా ప్రజల ఇబ్బందులను గురించి తెలుసుకోవడానికి రేపు ఉదయం ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌మండీ వద్ద సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కార్మికులు, వ్యాపారులు, రైతులు పాల్గొంటారని కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సామాన్యప్రజలు పడుతున్న కష్టాల గురించి తాను ఆరా తీయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ కార్యక్రమం గురించి మీడియాకు తెలుపుతూ పెద్దనోట్ల రద్దు ప్రభావం గురించి మాత్రమే తాము రేపటి సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.