: విజయ్ మాల్యా సహా బడా వ్యాపారవేత్తలకు ఊరట.. రూ.7 వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసిన ఎస్‌బీఐ

తమ వద్ద రుణం తీసుకొని ఎగ్గొట్టిన ప్రముఖ వ్యాపార వేత్తలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరట కలిగించే ప్రకటన చేసింది. మొత్తం 63 మంది డిఫాల్టర్లకు చెందిన రూ.7 వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. అంతేగాక, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు చెందిన బకాయిలను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఊరట పొందిన డిఫాల్టర్ల లిస్టులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విక్టరీ ఎలక్ట్రికల్, కేఆర్ ఆర్ ఇన్ ఫ్రా, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ సంస్థల అధినేతలు ఉన్నారు. తెలంగాణలో తోతమ్ ఇన్ ఫ్రా, ఎస్ ఎస్ వీజీ ఇంజినీరింగ్ కాలేజీ అధినేతలు ఉన్నారు.