: నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగలో ప్రజలతో సెల్ఫీ తీసుకున్న సచిన్ టెండూల్కర్
టీమిండియా మాజీ ఆటగాడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగలో ఈ రోజు పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడుతూ ఆ గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గ్రామం మరింత అభివృద్ధి దిశగా దూసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం వేదికపై నుంచి ప్రజలతో సెల్ఫీ తీసుకోవడానికి సచిన్ ఉత్సాహం చూపారు.